కొంచెం తీపి, కొంచెం పులుపు, కొంచెం కారం, కొంచెం చేదు, కొంచెం వగరు, కొంచెం కారం.. ఈ షడ్రుచుల సమ్మేళనం నేను.
నాది ఆత్మస్థైర్యం అని నేను అనుకుంటే పొగరు/బలుపు/గర్వం అని ఇంకొందరు అనుకోవచ్చు, అది నా తప్పు కాదు.
ఈ బ్లాగ్ విషయానికి వస్తే ఇది ఎవరిని ఉద్దేశించి నిర్దేసించి రాసేది అసలు కాదు, నాకంటూ నా మనోభావాలను వెళ్ళగక్కుకునే ఒక చోటు. నచ్చితే చదవండి, ప్రోత్సహిస్తే సంతోషిస్తా, సద్విమర్సలు చేస్తే ఆనందిస్తా, స్నేహితులకి స్నేహ హస్తాన్ని అందిస్తా అంతేకాని కేవలం నన్ను కించపరచటానికి, నిరుత్సాహపరచడానికి ఐతే మీరు చదవకపోవడమే మేలు అనేది నా ఉచిత సలహా.
ఎవరేమి అనుకున్నా ఇంకో మనిషికి హాని చెయ్యకుండా వీలైనంత మంచిని మాత్రం పంచుతూ ఒక మానవత్వం ఉన్న మనిషిగా బ్రతకడం నా జీవిత లక్ష్యం. పుట్టినందుకు పెద్దగా ఏమి సాదించకపోయినా ఎందుకు పుట్టాను రా అనిపించుకోకుండా వెళ్ళిపోతే అదే చాల పెద్ద మేలు అనుకుంటూ
No comments:
Post a Comment